సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 నవంబరు 2022 (22:21 IST)

ఆవకాయ్‌తో తంటా.. గొంతులో ఇరుక్కున్న టెంక.. ఆ మహిళకు ఏమైంది?

Avakaya
ఆవకాయ్ ఓ మహిళను ఆస్పత్రి పాలు చేసింది. మామిడి పచ్చడి తినడం వల్ల గొంతుకు గాయం అయ్యింది. ఆస్పత్రికి వెళ్లినా ఆమెను వైద్యులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే గొంతు నొప్పితో ఆ మహిళ నానా తంటాలు పడింది. చివరికి నాలుగు రోజుల తర్వాత తిరిగి ఆస్పత్రికి వెళ్తే.. ఆమె పరిస్థితి సీరియస్‌గా పరిగణించారు. 
 
సీటీ స్కాన్ తీస్తే.. గొంతులో మామిడి టెంక ఇరుక్కుని ఉన్నట్టు నిర్ధారించారు. దీంతో ఆ 57 ఏళ్ల మహిళకు అత్యవసరంగా సర్జరీ చేసి టెంకను గొంతు నుంచి బయటకి తీశారు. దీంతో వారం తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. తొలుత ఆస్పత్రికి వచ్చిన ఆమెను వైద్యులు నిర్లక్ష్యం చేశారని సదరు బాధితురాలు ఆరోపించింది. 
 
అయితే ఆస్పత్రి నిర్వాకం క్షమాపణలు చెప్పడంతో పాటు ఆస్పత్రి మార్గదర్శకాలను కూడా సవరించారు. ఈ వింత సంఘటన బ్రిటన్‌లో జరిగింది.