బుధవారం, 16 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 నవంబరు 2022 (15:12 IST)

కొడుకు ఆరోగ్యం కోసం కుమార్తెను బలిచ్చిన కసాయి తల్లి

murder
అనారోగ్యంతో బాధపడుతున్న 16 యేళ్ల కుమారుడి ఆరోగ్యం బాగుపడాలని కన్న కుమార్తెను బలిచ్చిందో కసాయి తల్లి. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. డీఎస్పీ తరుణ్ కాంత్ వెల్లడించిన వివరాల మేరకు.. రేఖ అనే మహిళకు 16 యేళ్ల కుమారుడు నికేంద్ర సింగ్ ఉన్నాడు. ఈ బాలుడినికి గుండెలో రధ్రం వుందని వైద్యులు చెప్పారు. పైగా, అతని మానసికస్థితి ఏమాత్రం బాగోలేదు. దీంతో ఎవరినైనా బలిస్తే కొరుడు ఆరోగ్యం బాగుపడుతుందని రేఖకు కొందరు చెప్పారు. 
 
అసలే మూఢనమ్మకం అధికంగా ఉండే రేఖ... తొలుత తన బిడ్డ కోసం భర్తను బలి ఇవ్వాలని ప్రయత్నం చేసి విఫలమైంది. ఆ తర్వాత తన ఏడేళ్ల కుమారుడు సింగం, కుమార్తె సంజనను కత్తితో పొడిచి, చంపడానికి ప్రయత్నించింది. అది కూడా విఫలమైంది. 
 
కానీ, అదే రోజు రోజు సాయంత్రం కుమార్తెకు స్నానం చేయిస్తూ బాత్రూమ్‌లోనే కత్తితో గొంతుకోసి చంపేసింది" అని డీఎస్పీ వివరించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేఖను అరెస్టు చేశారు.