గురువారం, 23 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated: శనివారం, 5 నవంబరు 2022 (16:34 IST)

శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ హాస్టల్‌లో ఫుడ్‌పాయిజనింగ్

srivari food
శ్రీకాకుళంలోని ట్రిపుల్ ఐటీలోని హాస్టల్‌లో వడ్డించే ఆహారం కలుషితమైంది. ఈ ఆహారాన్ని ఆరగించిన పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కొందరు విద్యార్థులకు వాంతులు విరేచనాలు కావడంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
 
శుక్రవారం సాయంత్రం వంద మందికిపై విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వీరిని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత తిరిగి హాస్టల్‌కు తరలించారు. గడిచిన 24 గంటల్లో ఏకంగా 336 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందినట్టు చికిత్స పొందినట్టు రికార్డులు చెబుతున్నాయి. 
 
మరోవైపు, ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అరకొరగా వైద్యం అందించిన వైద్య సిబ్బందిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వైద్య సిబ్బందిని పిలిపించి విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో పలువురు విద్యార్థులకు మరింత మెరుగైన వైద్యం కావాల్సి రావడంతో శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించారు.