సోమవారం, 11 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

విద్యార్థుల కోసం బస్సును ప్రారంభించిన మంత్రి ఆర్కే.రోజా

rkroja bus
విద్యార్థుల కోసం ఏపీ మంత్రి ఆర్కే.రోజా ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఆ తర్వాత విద్యార్థులతో పాటు ఇతర ప్రయాణికులతో కలిసి ఆమె ఆ బస్సులో ప్రయాణించారు. పుత్తూరు మండలంలోని పిల్లరిపట్టు గ్రామానికి సరైన బస్సు సౌకర్యాలు లేక విద్యార్థులతో పాటు గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం మంత్రి రోజా దృష్టికి వచ్చింది. దీంతో ఆర్టీసీ ఉన్నతాధికారులను సంప్రదించి స్కూలు సమయంలో విద్యార్థుల కోసం బస్సును నడపేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. 
 
దీంతో పిల్లరిపట్టు గ్రామం నుంచి ఆమె బస్సు సర్వీసును ప్రారంభించారు. ఆ తర్వాత బస్సులో విద్యార్థులతో కలిసి ప్రయాణించిన రోజా... వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆ బస్సులో ప్రయాణించిన ఇతర ప్రయాణికులతో పాటు ఆమె ముచ్చటించారు. తమ కోసం బస్సు సర్వీసును ప్రారంభించిన మంత్రి రోజాకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.