శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 నవంబరు 2022 (10:46 IST)

హైదరాబాద్ యూనివర్శిటీలో ర్యాగింగ్ భూతం.. 34మంది సస్పెండ్

హైదరాబాద్ నగరంలో పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. సీనియర్ విద్యార్థులు ర్యాంగింగ్‌కు పాల్పడ్డారని జూనియర్ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో 34మంది సీనియర్ విద్యార్థులను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది.  
 
ఎంసెట్‌లో మెరుగైన ర్యాంకులు సాధించి పశువైద్య డిగ్రీ కోర్సులో చేరిన జూనియర్‌ విద్యార్థులకు సీనియర్లు ర్యాగింగ్‌ పేరుతో నరకం చూపించారు. ఈ వేధింపులకు పాల్పడిన 34 మంది విద్యార్థులను తరగతులు, హాస్టళ్ల నుంచి పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం తాజాగా సస్పెండ్‌ చేసింది.
 
వీరిలో 25మందిని తరగతులు, మరో తొమ్మిది మందిని హాస్టళ్ల నుంచి, వర్సిటీ వాహనాలు ఎక్కకుండా నిషేధించింది. దీనిపై ప్రొఫెసర్లతో అంతర్గత కమిటీ వేసి విచారణ జరిపారు.