శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 నవంబరు 2022 (18:52 IST)

ముగిసిన మునుగోడు ఎన్నికల ప్రచారం ... 3 పోలింగ్

munugode voters
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఈ నెల 3వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. జరుగనుంది. ఇందుకోసం నిర్వహించిన ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 3వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఫలితాలను ఈ నెల 6వ తేదీన వెల్లడిస్తారు. 
 
మంగళవారం సరిగ్గా 6 గంటలు కాగానే మునుగోడు ఎన్నికల ప్రచారం ముగిసినట్టుగా ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్క ప్రాంతంలోనూ ఏ పార్టీకి చెందిన ప్రచారాన్ని అనుమతించరు. ఈ కీలక ఘట్టం ముగియడంతో అన్ని పార్టీల నేతలు గళం మూగబోయింది. 
 
ఇకపోతే ఈ ఉప ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టమైన పోలింగ్ ఈ నెల 3వ తేదీన గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంట వరకు జరుగనుంది. ఈ పోలింగ్ కోసం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ ఉప ఎన్నికల బరిలో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిసి మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన విషయం తెల్సిందే. వీరి భవితవ్యాన్ని మునుగోడు ఓటర్లు గురువారం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు.