మంగళవారం, 6 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2022 (16:26 IST)

మునుగోడు ఉపఎన్నిక : బీజేపీ అభ్యర్థికి ఎన్నికల సంఘం నోటీసు

komatireddy rajagopalreddy
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబరు 3వ తేదీన ఉప ఎన్నికల పోరు జరుగనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయనక ఎన్నికల సంఘంట నోటీసులు జారీచేసింది. 
 
రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందిన సుషీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కంపెనీపై అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతలు చేసిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని భారత ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. మునుగోడు నియోజకవర్గంలోని 23 మంది బ్యాంకు ఖాతాల్లోకి రూ.5.24 కోట్లు బదిలీ చేసినట్టు గుర్తించిన తెరాస నేతలు... ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. 
 
తెరాస నేతలు చేసిన ఆరోపణలపై సోమవారం సాయంత్రం లోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇతర ఖాతాల్లోకి బదిలీ చేసిన సొమ్మును ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు వినియోగించారన్నది తెరాస ప్రధాన ఆరోపణగా ఉంది.