మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 నవంబరు 2022 (14:25 IST)

రాహుల్ భారత్ జోడో యాత్రలో రోహిత్ వేముల తల్లి

rahul jodo yatra
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశాన్ని ఏకం చేసే నిమిత్తం భారత్ జోడో యాత్రను చేపట్టారు. ఈ యాత్ర ఇప్పటికే పలు రాష్ట్రాలు పూర్తి చేసుకుని తెలంగాణాలో కొనసాతోంది. అయితే, మంగళవారం ఈ యాత్ర హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించగా వందలాది మంది యాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. 
 
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సియు)లో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల తల్లి రాధిక వేముల యాత్రలో రాహుల్ గాంధీని కలుసుకుని ఆయన వెంట నడిచారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి రాజ్యాంగాన్ని కాపాడాలని, రోహిత్‌ వేములకి న్యాయం చేయాలని ఆమె రాహుల్‌ గాంధీని అభ్యర్థించారు.
 
ఈ సందర్భంగా ఆమెకు రాహుల్ మాట ఇచ్చారు. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు భారత్ జోడో యాత్రలో రోహిత్ వేముల తల్లి రాహుల్ గాంధీని కలిసిన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పూర్తి చేసిన సంగతి తెలిసిందే.