ఆదివారం, 14 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2022 (19:53 IST)

రాహుల్ పూనమ్ చేతులు పట్టుకోలేదు.. బీజేపీ దిక్కుమాలిన పార్టీ

Poonam Kaur_Rahul Gandhi
మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో భారత్ జోడో యాత్రలో సినీ నటి పూనం కౌర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేతిని పట్టుకుని మరీ యాత్రలో కొంతదూరం నడిచారు. ఈ ఫొటోను పోస్ట్ చేస్తూ బీజేపీ నేత ప్రీతి గాంధీ... తాత నెహ్రూ అడుగుజాడల్లోనే రాహుల్ గాంధీ నడుస్తున్నారంటూ విమర్శించారు. ఈ విమర్శలను ఖండిస్తూ కొండా సురేఖ స్పందించారు.
 
అదే సమయంలో ప్రీతి గాంధీ పోస్టుపై పూనం కూడా స్పందించారు. తాను కిందపడబోతే... రాహుల్ గాంధీ తన చేతిని పట్టుకున్నారని వివరణ ఇచ్చారు. రాహుల్ గాంధీ కావాలని పూనం చేతిని పట్టుకోలేదని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళలను గౌరవిస్తుందని కొండా సురేఖ వెల్లడించారు. 
 
ఇందిరా గాంధీ నుంచి సోనియా గాంధీ వరకు మహిళలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఆడవాళ్లను తల్లిలాగే చూసే పార్టీ తమదని గుర్తు చేశారు. పాదయాత్ర చేయని దిక్కుమాలిన పార్టీ ఒక బీజేపీ మాత్రమేనని సురేఖ అన్నారు. ప్పులుంటే వేలెత్తి చూపాలి గానీ చిల్లర ప్రయత్నాలు చేయకూడదని.. బీజేపీ ఆ చిల్లర రాజకీయాలను మానుకోవాలని కొండా సురేఖ ఫైర్ అయ్యారు.