శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 16 నవంబరు 2022 (14:39 IST)

ముగ్గురు కూర్చొని ప్రయాణించే బుల్లి ఎలక్ట్రిక్ కారు..

pmv electric car
ముగ్గురు కూర్చుని ప్రయాణించేలా బుల్లి ఎలక్ట్రిక్ కారును తయారైంది. ఈ కారు ధర రూ.4.79 లక్షలుగా నిర్ణయించచారు. అయితే, తొలి 10 వేల బుకింగులకు మాత్రమే ఈ ధరను అందిస్తారు. దీంతో ఇప్పటివరకు ఈ కారు కోసం ఆరు వేల మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారు. అయితే, స్థానిక రవాణా పన్నులు, బీమా చార్జీలు, యాక్సెసరీ చార్జీలకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మార్కెట్‌లో ఉన్న ఎలక్ట్రిక్ కార్లలో తక్కువ రేటుకు లభ్యమయ్యే వాహనం ఇదే కావడం గమనార్హం.
 
ఈ ఎలక్ట్రిక్ కారును పూణెకు చెందిన పీఎంవీ ఎలక్ట్రిక్ కంపెనీ తయారు చేసింది. ఈ కారును బుక్ చేయాలనుకునేవారు పీఎంవీ వెబ్‌సైట్‌కు వెళ్లి రూ.2 వేలు అడ్వాన్స్ రుసుంగా చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 
 
ఈ బుల్లి ఎలక్ట్రిక్ కారులో ఇద్దరు పెద్దలు, ఒక చిన్నారి కూర్చొని ప్రయాణం చేయవచ్చు. పట్టణాల్లో ప్రయాణినికి ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ కారు పొడవు 9.56 అడుగులు, వెడల్పు 3.79 అడుగులుగా ఉంటుంది. 5.24 అడుగుల ఎత్తులో ఉండే ఈ కారు బరువు 550 కేజీలు. 
 
ఇందులో ఆన్‌బోర్డు నేవిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే 120 నుంచి 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా బ్యాటరీ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. అయితే, బ్యాటరీ ఫుల్ చార్జ్ అయ్యేందుకు 4 గంటల సమయం పడుతుంది. ఈ చార్జింగ్ కూడా 15 యాంప్స్ సాకెట్ నుంచి చేసుకునే వెసులుబాటును కల్పించారు.