గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 16 నవంబరు 2022 (11:56 IST)

బాలి వేదికగా మోడీ - రిషి భేటీ : శుభవార్త చెప్పిన బ్రిటన్ ప్రధాని

modi - rishi
ఇండోనేషియా రాజధాని బాలి వేదికగా భారత్, బ్రిటన్ ప్రధానమంత్రులు కలుసుకున్నారు. వీరిద్దరి మధ్య భేటీ జరిగిన కొద్దిసేపటికే బ్రిటన్ శుభవార్త చెప్పింది. భారత్‌లోని యువ ప్రొఫెషనల్స్‌కు ప్రతి యేటా మూడ వేల వీసాలను మంజూరు చేస్తామని బ్రిటన్ తెలిపింది. 
 
బాలి వేదికగా జి-20 దేశాల శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఇందులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌లు భేటీ అయ్యారు. ఆ తర్వాత కాసేపటికే బ్రిటన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారత్‌లోని యువ నిపుణులకు ప్రతి యేటా 3 వేల వీసాలను మంజూరు చేస్తామని ప్రకటించింది. 
 
గత యేడాది అంగీకరించిన యూకే - ఇండియా మైగ్రేషన్ అండ్ మొబిలిటీ భాగస్వామ్యంలో భాగంగా ఈ పథకం నుంచి ఇలాంటి లబ్ది పొందిన మొదటి దేశంగా భారతేనని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. 
 
యూకే - ఇండియా యంగ్ ప్రొఫెషనల్ పథకం కింద 18 నుంచి 30 యేళ్లలోపు డిగ్రీ పూర్తి చేసిన భారత పౌరులు బ్రిటన్‌కు వచ్చి రెండేళ్లపాటు ఉండేందుకు 3 వేల వీసాలను అందిస్తున్నట్టు యూకే ప్రధాని కార్యాలయం ఓ ట్వీట్ చేసింది. 
 
బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌, ప్రధాని నరేంద్ర మోడీలు జీ20 సమ్మిట్‌లో కలుసుకున్న కాసేపటికే బ్రిటన్ ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం. బ్రిటన్ పగ్గాలు చేపట్టిన తొలి భారతీయ సంతతికి చెందిన పౌరుడు రిషి సునక్ చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే. ఆయన భారత ప్రధానితో భేటీ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.