బుధవారం, 6 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 14 నవంబరు 2022 (23:40 IST)

చిక్కుడు కాయలు తింటుంటే ఏం జరుగుతుందో తెలుసా?

chikkudukaya uses
చిక్కుడుకాయలు మన శరీరానికి పోషకాలను అందించడంలో కీలక పాత్ర వహిస్తుంది. వీటిలో ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. చిక్కుడు కాయలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలేమిటో తెలుసుకుందాము.

 
చిక్కుడు కాయల్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, డయేరియా వంటివి దరిచేరవు.
 
మధుమేహం నియంత్రించడంతో పాటు చెడు కొలస్ట్రాల్ తగ్గుముఖం పడతాయి.
 
బరువు తగ్గాలనుకునేవారికి చిక్కుడుకాయలు మంచి ఔషధంలా పని చేస్తాయి.
 
చిక్కుడు కాయల్లోని విటమిన్ బి1 మెదడు పనితీరులో అత్యంత కీలకమైన ఎసిటైల్ కోలీన్ అనే న్యూరో ట్రాన్స్‌మిటర్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.
 
చిక్కుళ్లలో విటమిన్ బి1 గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
 
చిక్కుడులో వుండే కాపర్ మెదడు ఆరోగ్యానికి అవసరమైన డోపమైన్, గ్యాలాక్టోజ్ వంటి రసాయనాల విడుదలకు తోడ్పడుతుంది.
 
చిక్కుడు కాయలు వృద్దాప్యం వల్ల వచ్చే అనేక వ్యాధుల్ని నివారిస్తాయని తేలింది.
 
చిక్కుడులో వుండే సెలీనియం, మాంగనీస్ వంటి ఖనిజాలు ఊపిరితిత్తుల సమస్యలను నిరోధించడంలో సహాయపడతాయి.