పిస్తానా మజాకా.. తింటే తెలుస్తుంది.. ఎంత మేలని?
పిస్తాపప్పులో ఫ్యాటీ యాసిడ్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. పిస్తాపప్పుల లక్షణాలలో లుటిన్, కెరోటినాయిడ్లు పుష్కలంగా వున్నాయి. ఇవి కళ్ళ రెటీనాకు మేలు చేస్తాయి. దీన్ని తినడం వల్ల క్యాలరీలను అదుపులో ఉంచుకోవచ్చు. బరువు పెరగకుండా నిరోధించవచ్చు.
అంతేగాకుండా టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులలో రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఇన్సులిన్ నిరోధకతకు సాయపడతాయి. పిస్తాపప్పులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
పిస్తా మెదడును ఆరోగ్యంగా ఉంటుంది. పిస్తాలో ఫ్లేవనాయిడ్స్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.
పిస్తాపప్పులు తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. పిస్తాపప్పు తీసుకోవడం ద్వారా, ఐరన్ శరీరానికి చేరుతుంది. తద్వారా హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఈస్ట్రోజెన్‌ను సమతుల్యంగా ఉంచడానికి పిస్తాపప్పులను తప్పకుండా తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
అంతేగాకుండా పిస్తా పప్పులు బాలింతలకు మేలు చేస్తాయి. ఇవి శిశువులకు ఐరన్ సరఫరా చేస్తాయి. పిస్తాపప్పులు జుట్టుకు అవసరమైన అమైనో ఆమ్లాలకు మంచి మూలమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.