తమలపాకులు తీసుకుంటే ఏంటి ఫలితం..?
తమలపాకులు తీసుకుంటే ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. ఇది ఆకలిని కూడా చాలా వరకు నియంత్రిస్తుంది. రాత్రిపూట తమలపాకులను నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది. తమలపాకుల్లో కొద్దిగా ఉప్పు, జీలకర్ర కలిపి తింటే అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది.
అలాగే తమలపాకు రసంతో వాము కలిపి తింటే ఎముకలకు బలం చేకూరుతుంది. గొంతు సమస్యలకు, తమలపాకు రసంలో కొద్దిగా సున్నం కలిపి తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది.
తమలపాకుల్లో ఆల్కలీన్ వుంటుంది. తమలపాకులను ఉపయోగించినప్పుడు కాండం, నరాల లాంటి వాటిని తీసేయడం మంచిది. తమలపాకుల్లో ఐరన్, ఫైబర్, కాల్షియం, థయామిన్, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ సి, ఎ వంటి పోషకాలు ఉన్నాయి.