గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 నవంబరు 2022 (15:56 IST)

సపోటాలతో ఆరోగ్యం.. తక్షణ శక్తి కోసం..?

సపోటాలతో ఆరోగ్యం మేలు చేస్తుంది. డయేరియాకు ఇది మంచి మందుగా పనిచేస్తుంది. పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌ను తగ్గిస్తుంది. యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ సమ్మేళనాలు మెండుగా వుంటాయి. సపోటా పండులో గుజ్జు నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. 
 
ఇందులోని బోలెడు పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ పండులో ఇనుము, పొటాషియం, కాపర్, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్ లాంటి ఖనిజాలు యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు, పీచు పుష్కలంగా వుంటాయి. అధిక మొత్తంలో కెలోరీలుండే ఈ పండు తక్షణ శక్తిని అందిస్తుంది. 
 
జీర్ణక్రియ సక్రమంగా సాగేలా చూస్తుంది. ఈ పండులో విటమిన్ ఎ మెండుగా ఉంటుంది. దీన్ని తీసుకుంటే కంటి ఆరోగ్యానికి మంచిది. రోగనిరోధకతను పెంచే విటమిన్-సి పుష్కలమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.