గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 మే 2022 (19:21 IST)

గుండెకు మేలు చేసే కరివేపాకు.. ఒత్తిడి కూడా పరార్.. ఎలా?

Curry leaves
ఒత్తిడిని తగ్గించడంలో కరివేపాకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఒత్తిడి తగ్గి మెదడుకు క్యాల్షియం సరఫరా చేసి మనసును ఎంతో హాయిగా ఉంచుతుంది. కరివేపాకులో ప్రోటీన్లు, క్యాల్షియం, ఐరన్, ఏ, బి, సి విటమిన్ పుష్కలంగా వుంటాయి. 
 
నోటి పూతతో బాధ పడేవారు పచ్చి కరివేపాకు ఆకులు ప్రతి రోజూ ఉదయాన్నే నమిలితే త్వరలో నోటి పూత తగ్గిపోతుంది. చక్కెర వ్యాధి గ్రస్తులు ప్రతిరోజూ పరగడుపున కరివేపాకు ఒక రెబ్బ ఆకులు నమలడం మంచిది. ఇలా చేస్తే రక్తంలో షుగర్ శాతం తగ్గుతుంది.
 
కరివేపాకు ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే కిడ్నీ సంబంధిత రోగాలు తొలగిపోతాయి. 
 
కరివేపాకు ఎక్కువగా తింటే రక్తం పలుచగా మారి గుండెకు ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా నూనెలో కరివేపాకు వేసి, బాగా మరిగించి రోజూ ఆ తైలాన్ని తలకు రాసుకుంటే క్రమ క్రమంగా జుట్టు నల్లబడుతుంది.