1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 4 మే 2022 (21:56 IST)

చేపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? (video)

Fish
చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు డి- బి2 ఉంటాయి. చేపలో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. ఇనుము, జింక్, అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాల గొప్ప మూలం. ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా వారానికి కనీసం రెండుసార్లు చేపలు తినాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేస్తోంది.

 
పొట్ట దగ్గర కొవ్వును కరిగించేందుకు ఫిష్ ఆయిల్ మేలు చేస్తుందంటారు నిపుణులు. క్యోటో విశ్వవిద్యాలయం పరిశోధన ప్రకారం, చేపల నూనె మనిషి శరీరంలో కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వారి 30- 40 ఏళ్లలో సమర్థవంతమైన ప్రత్యామ్నాయం అని చెపుతారు.
 
ఎండుచేపలు తింటే...
పచ్చి చేపలు, ఎండు చేపలు. వారంలో ఒకటిరెండుసార్లు చాలామంది పచ్చి చేపలు తింటుంటారు. ఐతే కొందరు ఎండు చేపలను కూడా తింటారు. ఇవి కాస్త వాసన వస్తుంటాయి కానీ ఇందులో వుండే ప్రోటీన్లు చాలా ఎక్కువ.

 
ఎండిన చేపలను ప్రోటీన్ ప్రధాన వనరుగా పరిగణించవచ్చు. కానీ చాలా తక్కువ మొత్తంలో కేలరీలను అందిస్తుంది. ఎండు చేపలు తినడం వల్ల బరువు పెరగరు అధిక-నాణ్యత ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఐకోసపెంటెనోయిక్ యాసిడ్, డోకోసాహెక్సేనోయిక్ యాసిడ్‌తో సహా ఎండు చేపల్లో వుంటాయి.

 
అంతేకాదు అయోడిన్, జింక్, రాగి, సెలీనియం, కాల్షియం కూడా వుంటాయి. కనుక వారానికో లేదంటే పదిహేనురోజులకు ఒకసారైనా ఎదిగేపిల్లలకి ఎండు చేపలు పెట్టడం మంచిది.