మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 మే 2022 (07:41 IST)

ఆస్పత్రిలో బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి

mithun chakraborty
బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో పడకపై మిథున్ చక్రవర్తి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో తమ అభిమాన నటుడుకు ఏమైదో తెలియక ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 
 
దీంతో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి స్పందించారు. తన తండ్రికి కిడ్నీల్లో రాళ్లు ఉండటంతో తీవ్ర నొప్పితో బాధపడ్డారని, అందుకే గత నెల 30వ తేదీన ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. అయితే, ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారన్నారు. దీంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇదిలావుంటే, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, అభిమానులు ఆందోళన చెందనక్కర్లేదని తెలిపారు.