గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 మే 2022 (20:08 IST)

ఆస్పత్రిలో మిథున్ చక్రవర్తి : కిడ్నీలో రాళ్లు ఉండడంతో..?

Mithun Chakraborty
Mithun Chakraborty
సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మిథున్ చక్రవర్తి ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి స్పందించారు. కిడ్నీలో రాళ్లు ఉండడంతో తన తండ్రి నొప్పితో బాధపడ్డారని, అందుకే ఏప్రిల్ 30న ఆసుపత్రిలో చేరినట్టు వైద్యులు తెలిపారు. 
 
వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారని, ప్రస్తుతం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని మిమో తెలిపారు.