1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. How to apply Vitamin E capsules for face lightening?

ముఖం కాంతివంతంగా చేసే విటమిన్ ఇ క్యాప్సూల్స్‌, ఎలా అప్లై చేయాలి?

Vitamin E capsules
చర్మం ప్రకాశవంతంగా వుండేందుకు విటమిన్ ఇ క్యాప్సూల్ మాస్క్ వేసుకుంటారు. రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్ నుండి నూనెను పిండి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, కొన్ని చుక్కల నిమ్మరసంతో కలపండి. బాగా కలిపాక ముఖం మీద అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ మాస్క్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగించండి.

 
విటమిన్ ఇ, పెరుగు చర్మం నుండి అన్ని మలినాలను శుభ్రపరుస్తాయి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మానికి పోషణ, తేమను అందిస్తుంది. మచ్చలు- డార్క్ స్పాట్‌లను తగ్గించడం ద్వారా నిస్తేజమైన చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. నిమ్మరసం సహజ చర్మాన్ని కాంతివంతం చేసే ఏజెంట్‌గా పనిచేస్తుంది.

 
ఐతే నిమ్మరసం కాస్తంత చికాకు కలిగించవచ్చు, కాబట్టి సున్నితమైన చర్మం ఉన్నట్లయితే నిమ్మరసాన్ని వాడకపోవడం మంచిది.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
ఈ న్యూట్రిషన్‌ మాసంలో గుండెకు ఆరోగ్యం అందించే ఆహారానికి సమ్మతి తెలపండి