గురువారం, 30 నవంబరు 2023
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: శనివారం, 27 ఆగస్టు 2022 (23:14 IST)

సౌందర్యానికి పసుపు, నిమ్మకాయ ఎలా పనిచేస్తాయో తెలుసా?

turmeric
నిమ్మకాయలో సహజంగా విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది టాన్ తొలగించడంలో సహాయపడుతుంది. చర్మం నుండి జిడ్డును తగ్గిస్తుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. నిమ్మరసం- పంచదార మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 5-7 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఈ మిశ్రమాన్ని వారానికి రెండుసార్లు అప్లై చేయండి.

 
పసుపు, ప్రధాన భాగం కర్కుమిన్ కలిగి ఉన్న ఒక సాధారణ మసాలా. సహజ యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా శరీర మంట నుండి బయటపడటానికి, చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. శెనగపిండిలో అర టీస్పూన్ పసుపు వేసి పేస్టులా తయారు చేసి, దానికి కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేసి నీళ్లలో కలపాలి. దీన్ని ముఖం, మెడకు పట్టించి, ఆరిపోయే వరకు వదిలి, ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.