బుధవారం, 4 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 5 ఆగస్టు 2022 (23:27 IST)

చర్మ సౌందర్యం కోసం ఇంటి చిట్కాలు

Beauty
కేశాలకు, ముఖానికి ఇచ్చిన ప్రాధాన్యత చాలామంది చర్మానికి ఇవ్వరు. చర్మ సౌందర్యం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందే. లేదంటే చర్మం పాలిపోయినట్లవుతుంది. మరికొందరులో చర్మం నలుపుగా మారి అందవిహీనంగా మారుతుంది. శతాబ్దాలుగా ఉపయోగించబడుతున్న ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో కలబంద. చర్మాన్ని పునరుజ్జీవింపజేసే లక్షణాలను కలిగి ఉంది. సహజమైన, ఆరోగ్యకరమైన మెరుపును శరీరానికి ఇస్తుంది. కలబందను పసుపు, తేనె, పాలు, నీటితో మిక్స్ చేసి ముఖం- మెడపై అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత పావుగంటసేపు అలాగే ఉంచాలి. గోరువెచ్చని నీటితో కడిగి ఆరబెట్టి చూడండి, మార్పు మీకే తెలుస్తుంది.

 
బేకింగ్ సోడా స్క్రబ్ డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించి చర్మాన్ని న్యూట్రలైజ్ చేయడంలో సహాయపడుతుంది. ఇందులో స్కిన్ ఇన్‌ఫెక్షన్లను నిరోధించే యాంటీ బ్యాక్టీరియల్స్ ఉంటాయి. గోరువెచ్చని నీరు లేదా తేనె లేదా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి బేకింగ్ సోడాను పేస్ట్ చేసి ముఖంపై సులభంగా మసాజ్ చేయవచ్చు. 10 నిమిషాలు అలాగే ఉంచి చల్లటి నీటితో కడిగేయండి. చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.

 
బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ చర్మంపై నేరుగా చికిత్స చేసినప్పుడు చర్మం రికవరీని ప్రోత్సహించి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ పండు వివిధ చికిత్సలలో పదేపదే ఉపయోగించబడుతుంది. విటమిన్ ఎ వల్ల చర్మాన్ని పోషణ, హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే కొబ్బరినూనె కూడా చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇన్ఫెక్షన్‌కు వ్యతిరేకంగా యాంటీ బాక్టీరియల్ రక్షణను అందించడం, మంటను తగ్గించడం, యాంటీఆక్సిడెంట్‌లను అందించడం చేస్తుంది.