మంగళవారం, 12 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 8 ఆగస్టు 2022 (23:58 IST)

జిడ్డు చర్మం వున్నవారి చర్మం నిగనిగల కోసం

జిడ్డు చర్మానికి ఆరు కప్పుల డిస్టిల్డ్ వాటర్‌కి అరకప్పు లిక్విడ్ కాస్టిల్ సబ్బు కలపాలి. ఇందులో ముందుగానే వేపాకులను మరిగించి వడకట్టిన నీటిని రెండు చెంచాలు, అరకప్పు కొబ్బరినూనె, 15 చుక్కల లావెండర్ ఎసెన్షియల్ నూనె వేసి బాగా కలపాలి. ఈ బాడీవాష్ తో స్నానం చేస్తే జిడ్డుతత్వం దూరమవుతుంది. చర్మం తాజాగా కనిపిస్తుంది. ఈ బాడివాష్ ను 6 నెలల వరకూ వాడుకోవచ్చు.

 
అరకప్పు షియా బటర్ ను అవెన్లో వేడిచేసి అందులో అరకప్పు బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమంలో కప్పు లిక్విడ్ కాస్టిల్ సబ్బు, 10 చుక్కల రోజ్ ఎసెన్షియల్ నూనె వేసి ఒక పొడి సీసాలోకి తీసుకుంటే 6 నెలలు నిల్వ వుంటుంది. సున్నిత చర్మతత్వం వున్న వారికి ఈ బాడీ షేప్ మంచి ఫలితాన్నిస్తుంది.