కోడిగుడ్డులో ఫైబర్ వుంటుందా? అసలు ఫైబర్ అంటే ఏంటి?
ఫైబర్ జీర్ణం కాని, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లకు చెందిన తరగతి. ప్రీబయోటిక్స్‌గా వుండే ఇవి మంచి బ్యాక్టీరియా కార్యకలాపాలను జరిగేట్లు చూస్తాయి. ఫైబర్ మరో కీలక పాత్ర రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమబద్ధీకరించడం. ఈ చర్య ముఖ్యంగా కరిగే ఫైబర్ ద్వారా జరుగుతుంది. కరిగే ఫైబర్ సాధారణంగా పండ్లు, చిక్కుళ్ళు, వోట్స్‌లో వుంటాయి. కరగని ఫైబర్ గోధుమలు, ధాన్యపు పొట్టు, కూరగాయలలో కనిపిస్తుంది.
చాలామంది కోడిగుడ్లలో ఫైబర్ వుంటుందని అనకుంటారు కానీ వాటిలో ఫైబర్ ఉండదు. పండ్లు- కూరగాయల స్మూతీస్ ఫైబర్ కలిగి ఉంటాయి. పాలలో ఫైబర్ ఉండదు. చికెన్‌లో ఫైబర్ అధికంగా ఉంటుందేమో అని చాలామంది అనుకుంటారు కానీ ఇందులో కూడా ఫైబర్ వుండదు.