వర్షాకాలంలో శొంఠిపొడిని ఇలా ఉపయోగిస్తే..?
వర్షాకాలంలో శొంఠిపొడిని ఆహారంలో భాగం చేసుకోవాలి. శొంఠి పొడిని నిమ్మరసంలో కలిపి సేవిస్తే పిత్త సమస్యలు తొలగిపోతాయి. శొంఠి, మిరియాలతో కలిపి కషాయం చేసి సేవిస్తే జలుబు మాయం అవుతాయి. తమలపాకులో కొద్దిగా పంచదార కలిపి నమలడం వల్ల గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
శొంఠి పొడిని టీ తయారు చేసి నిత్యం తాగితే దగ్గు సమస్య నుంచి బయటపడవచ్చు. అర టీస్పూన్ శొంఠి పొడిని ఒక గ్లాసు నీటిలో కలిపి గోరువెచ్చగా వేడి చేసి అందులో తేనె కలుపుకుని రోజూ తాగితే అందులోని థర్మోజెనిక్ ఏజెంట్ కొవ్వులను కరిగించి, పొట్టలోని కొవ్వును తగ్గించి శరీర బరువును కాపాడుతుంది.
తేలికపాటి జ్వరం, తలనొప్పికి సాధారణ నీటిలో శొంఠి పొడిని కలిపి నుదుటిపై రాయాలి. మైగ్రేన్ తలనొప్పికి పసుపు ఒక అద్భుతమైన ఔషధం. మూడు చిటికెల శొంఠి పొడిని తేనెలో కలిపి 45 రోజుల పాటు తీసుకుంటే తలనొప్పి మాయమవుతుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే వాంతులకు శొంఠి పొడిని చాలా తక్కువ మోతాదులో తేనెతో కలిపి తింటే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.