తేగలు- ఆరోగ్య ప్రయోజనాలు
మార్కెట్లోకి తేగలు వచ్చేసాయి. వీటిలో పీచు పదార్థం ఎక్కువ. సీజనల్ ఫుడ్ అయినటువంటి ఈ తేగలను తీసుకుంటే ఒనగూరే ప్రయోజనాలను తెలుసుకుందాము.
తేగలలో వుండే పీచు పదార్థం జీర్ణక్రియ ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది.
క్యాన్సర్‌ను తొలి దశలోనే నిర్మూలించే శక్తి తేగలుకున్నాయంటారు.
తేగలు తింటే పెద్దపేగుల్లో మలినాలను చేరకుండా చేస్తాయి, టాక్సిన్లను తొలగిస్తాయి.
తేగలలో వుండే క్యాల్షియం ఎముకలకు బలాన్నిస్తాయి, ఫాస్పరస్ శరీరానికి దృఢత్వాన్నిస్తాయి.
తేగలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
ఆకలిని నియంత్రించే శక్తి తేగలకు వుండటంతో అధిక ఆహారం తీసుకోవడం తగ్గుతుంది.
శరీరానికి చలవనిస్తాయి, నోటిపూతను తగ్గిస్తుంది.
ఐతే తేగలను అధికంగా తీసుకోకూడదు. రోజుకు రెండు తీసుకోవచ్చు.