1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Taking too Much Orange not good for health

ఆరెంజ్ పండ్లను అతిగా తీసుకుంటే..? ఒక రోజులో నాలుగైదు తీసుకుంటే..?

orange
ఆరెంజ్ పండ్లను అదే పనిగా తీసుకుంటున్నారా.. అయితే ఈ కథనం మీ కోసమే. నీరసంగా ఉన్నప్పుడు, శరీరం సహకరించనప్పుడు కాస్త బలం కోసం నారింజ తినమని సిఫారసు చేస్తారు వైద్యులు. అయితే, కొందరు అవసరమైన దానికంటే ఎక్కువగా తింటుంటారు. అది అధిక పొటాషియం స్థాయిలు ఉన్నవారికి సమస్యలను కలిగిస్తుంది. 
 
శరీరంలో ఇప్పటికే తగినంత పొటాషియం ఉంటే.. అది హైపర్‌కలేమియా అనే తీవ్రమైన పరిస్థితికి దారి తీస్తుంది. వాస్తవానికి, నారింజలో ఆమ్లత్వంగా అధికంగా ఉంటుంది. దీని కారణంగా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు మరింత ఇబ్బంది పడుతారు. అందుకే, ఒక రోజులో 1 లేదా 2 నారింజలను మాత్రమే తినాలని సూచిస్తున్నారు. 
 
ఆరెంజ్‌లో తగినంత విటమిన్ సి, నీరు ఉంటుంది. చలికాలంలో దీన్ని తినడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. దీంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే, ఆరెంజ్‌తో ఆరోగ్యం బాగుంటుంది కదా అని అతిగా తిన్నా కూడా కష్టమేనట. 
 
ఒక రోజులో నాలుగైదు నారింజలను తీసుకుంటే.. అది శరీరంలో ఫైబర్ కంటెంట్‌ని పెంచుతుంది. శరీరంలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటే.. ఉదర సంబంధిత సమస్యలు పెరుగుతాయి. 
 
దీనివల్ల పొత్తికడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, వికారం వంటి సమస్యలు వస్తాయి. అవసరమైన దానికంటే ఎక్కువ విటమిన్ సిని ఎప్పుడూ తినకూడదు. ఇది గుండెల్లో మంట, వాంతులు, నిద్రలేమి, గుండెపోటు వంటి సమస్యలను కలిగిస్తుందని వైద్యులు చెప్తున్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
తేగలు- ఆరోగ్య ప్రయోజనాలు