మంగళవారం, 25 జూన్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 నవంబరు 2022 (18:44 IST)

మృదువైన శిరోజాల కోసం.. పెరుగు.. అలోవెరా జెల్

Oil
Oil
పెరుగు ద్వారా శిరోజాలకు తగినంత తేమ లభిస్తుంది. జుట్టు మూలాల నుంచి పోషణ లభిస్తుంది. కోడిగుడ్డులోని తెల్లసొనను వాడటం ద్వారా జుట్టు మృదువుగా మారుతుంది. ఇందులో నిమ్మరసం కలిపి తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. 
 
అలోవెరా జెల్‌లో సహజసిద్ధమైన మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. కాబట్టి అలోవెరా జెల్ జుట్టుకు రాయడం వల్ల జుట్టు రేగడం తగ్గిపోయి కుదురుగా ఉంచుతుంది. 
 
ఎక్కువ నూనె కాకుండా.. కొద్దిగా ఆల్మండ్ నూనెను జుట్టుకు రాస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది రేగిన జుట్టును సరిచేయడమే కాదు. శిరోజాల సౌందర్యాన్ని పరిరక్షిస్తుంది. 
 
అన్ని రకాల జుట్టు సమస్యలకు ఆపిల్ వెనిగర్  చక్కటి పరిష్కారం. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రేగడాన్ని అరికడుతాయి. వారానికొకసారి ఈ ప్యాక్ వేస్తూ వుండాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.