మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 ఆగస్టు 2022 (18:58 IST)

జీఎస్ఎల్వీ మార్క్-3 ద్వారా గగన్ యాన్ : షార్ డైరెక్టర్ రాజరాజన్

isro launchpad
ఇటీవల శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రయోగించి ఎస్ఎస్ఎల్వీ డీ1 ప్రయోగం విఫలం కావడంపై షార్ డైరెక్టర్ రాజరాజన్ స్పందించారు. సెన్సార్ సమస్య తలెత్తడం వల్లే ఎస్ఎస్ఎల్వీ డీ1 ప్రయోగం విఫలమైందన్నారు. ఆ తర్వాత ఈ లోపాన్ని గుర్తించి సరి చేసినట్టు చెప్పారు. 
 
అదేసమయంలో సెప్టెంబరు లేదా అక్టోబరు నెలల్లో జీఎస్ఎల్వీ మార్క్ 3 ద్వారా గగన్ యాన్ ప్రయోగం చేపట్టబోతున్నామని వెల్లడించారు. గగన్ యాన్‌లో తొలుత మానవరహిత ప్రయోగాలు జరిపిన తర్వాతే పూర్తిస్థాయి ప్రయోగం ఉంటుందని తెలిపారు. గగన్ యాన్ ప్రయోగానికి మరో నాలుగు ప్రధాన గ్రౌండ్ పరీక్షలు చేయాల్సి ఉంటుందన్నారు. 
 
అయితే, వచ్చే యేడాది ఫిబ్రవరి నుంచి జూలై మధ్య జీఎస్ఎల్వీ మార్క్ 3 ద్వారా చంద్రయాన్ ప్రయోగం ఉంటుందని ఆయన వెల్లడించారు. వచ్చే నాలుగు నెలల్లో నాలుగు ప్రయోగాలు చేసే దిశగా ఇస్రో పని చేస్తుందని రాజరాజన్ తెలిపారు.