1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Smoked In "Dummy" Plane: Influencer After Airline Shared Flight Number

స్పైస్‌జెట్ విమానంలో సిగరెట్ కాల్చిన బాబీ.. వివరణ ఇచ్చాడు..

Smoked In Dummy Plane
Smoked In Dummy Plane
స్పైస్‌జెట్ విమానంలో సిగరెట్ తాగిన కేసుకు సంబంధించి సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ బాబీ కటారియా ఈ ఘటనపై వివరణ ఇచ్చాడు. తాను సిగరెట్ తాగింది నిజమైన విమానంలో కాదని.. అది డమ్మీ విమానంలో అని అన్నాడు. దుబాయ్‌లో ఓ షూటింగ్‌లో భాగంగా చేసిందన్నాడు. 
 
అయితే, జరిగిన ఘటనపై స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ ఇచ్చిన వివరణకు బాబీ కటారియా వాదన పూర్తి విరుద్దంగా ఉంది. ఈ ఘటన జనవరిలో తమ విమానంలో జరిగిందని స్పైస్ జెట్ ధ్రువీకరించింది. ఈ విషయాన్ని క్షుణ్ణంగా విచారించామని, గుర్గావ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు.
 
ఫిబ్రవరిలోనే అతడిని 15 రోజుల పాటు నో -ఫ్లైయింగ్ లిస్ట్‌లో ఉంచినట్లు ఎయిర్‌ లైన్స్ తెలిపింది. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. అటువంటి ప్రమాదకర ప్రవర్తనను సహించేది లేదని మంత్రి చెప్పారు.
తర్వాతి కథనం
భారత మార్కెట్లోకి ఆడి క్యూ3.. రూ.2లక్షలతో బుక్ చేసుకోవచ్చు