ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 డిశెంబరు 2021 (08:58 IST)

పాముల కోసం పొగబెడితే రూ.13 కోట్ల ఇల్లు బుూడిదైంది... ఎక్కడ?

ఇంట్లోకి వచ్చి తిష్టవేస్తున్న పాముల బెడదను వదిలించుకునేందుకు ఓ వ్యక్తి ఇంట్లో బొగ్గుల కుంపటితో పొగబెట్టాడు. కానీ, పాముల బెడద పోయిందో లేదో గానీ ఏకంగా రూ.13 కోట్ల విలువ చేసే ఇల్లు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన అమెరికాలోని మేరీల్యాండ్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లోకి పాములు అధిక సంఖ్యలో వచ్చి చేరుతున్నాయి. దీంతో వాటి బెడద నుంచి తప్పించుకునేందుకు ఆయన ఇంట్లో పొగబెట్టారు. 
 
అయితే, ఈ కుంపటికి సమీపంలో కొన్ని మండే స్వభావం కలిగిన వస్తువులు ఉన్నాయి. వీటిని ఇంటి యజమాని గమనించలేదు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు క్షణాల్లో ఇంటిలో మొత్తం వ్యాపించడంతో కోట్లాది రూపాయల విలువ చేసే ఇల్లు అగ్నికి ఆహుతైంది.
 
సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. దీనికి సంబంధించిన ఓ ఆడియోను అగ్నిమాపకశాఖ సోషల్ మీడియాలో షేర్ చేసింది.