1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 డిశెంబరు 2021 (15:42 IST)

లింగ మార్పిడి తర్వాత ఉద్యోగంలో చేరొచ్చు.. ఎంపీ పోలీస్ శాఖ

ఒక మహిళా కానిస్టేబుల్ లింగ మార్పిడి తర్వాత కూడా ఉద్యోగం కొనసాగించేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ అనుమతి ఇచ్చింది. ఓ మహిళా కానిస్టేబుల్ చేసిన విజ్ఞప్తిపై ఆ రాష్ట్ర పోలీస్ శాఖ సానుకూలంగా స్పందించింది. 
 
అంతకుముందు పోలీస్ శాఖలో పని చేసే మహిళా కానిస్టేబుల్ లింగ మార్పిడి చేసుకునేందుకు మధ్యప్రదేశ్ పోలీస్ శాఖ అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత ఆమె ఉద్యోగంలో కొనసాగేందుకు పోలీస్ శాఖతో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా సమ్మతించింది. లింగ మార్పిడి చేసుకున్న తర్వాత ఉద్యోగంలో కొనసాగేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ఎంపీ పోలీస్ శాఖలో పని చేసే ఓ మహిళా కానిస్టేబుల్‌కు చిన్నప్పటి నుంచి జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ సమస్య ఉందని, జాతీయ స్థాయి సైకియాట్రిస్టులు కూడా దీనిని ధృవీకరించారు. 2019లో గెజిట్ ఆఫ్ ఇండియాలో ఉన్న నోటిఫికేషన్ ఆధారంగా అఫిడవిట్ సమర్పిస్తూ సదరు మహిళా కానిస్టేబుల్ లింగ మార్పిడికి దరఖాస్తు చేసుకుంది. దీనికి పోలీస్ శాఖ అనుమతి ఇచ్చింది.