శనివారం, 2 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 23 అక్టోబరు 2022 (10:48 IST)

జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం విజయవంతం (video)

ISRO
ISRO
ఇస్రో నుంచి జీఎస్ఎల్వీ మార్క్-3(ఎల్‌వీఎం3-ఎం2) రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. ఏపీలోని
తిరుపతి జిల్లాలో ఉన్న సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి అర్ధరాత్రి 12.07 గంటలకు జీఎస్‌ఎల్వీ-మార్క్‌ 3 రాకెట్‌.. నిప్పులు విరజిమ్ముతూ.. నింగిలోకి దూసుకెళ్లింది. 
 
విదేశాలకు చెందిన 36 ఉపగ్రహాలను ఇది విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. 19 నిమిషాల 7 సెకన్లలోనే ఈ ప్రయోగం పూర్తయింది. జీఎస్‌ఎల్వీ-మార్క్‌ 3 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలంతా హర్షధ్వానాలతో ఆనందం వ్యక్తం చేశారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కోసం నిర్వహించిన మొదటి వాణిజ్య ప్రయోగం ఇదే కావడం విశేషం.
 
ప్రైవేట్‌ శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ కంపెనీ వన్‌వెబ్‌కి చెందిన 36 బ్రాడ్‌బ్యాండ్‌ కమ్యూనికేషన్‌ శాటిలైట్లను ఈ రాకెట్‌ ద్వారా రోదసిలోకి పంపింది. జీఎస్‌ఎల్వీ మార్క్ 3కి బాహుబలి రాకెట్‌గా పేరుంది. దీని పొడవు 44.3 మీటర్ల వరకు ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైంది.