గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 ఆగస్టు 2023 (19:15 IST)

హవాయి దీవిలో మంటలు: 36 మంది మృతి.. పలు ఇళ్లు దగ్ధం

fire
మౌయి ద్వీపం యునైటెడ్ స్టేట్స్‌లోని హవాయి దీవులలో ఒకటి. ఈ దీవిలో భయంకరమైన మంటలు వ్యాపించాయి. ముఖ్యంగా ప్రముఖ పర్యాటక పట్టణం లహైనాలో మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో నివసిస్తున్న 12,000 మంది ప్రజలను వారి ఇళ్ల నుండి ఖాళీ చేయించారు. వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. 
 
అడవి మంటల నుంచి తప్పించుకునేందుకు కొందరు సముద్రంలోకి దూకారు. వేగంగా వ్యాపిస్తున్న అడవి మంటల్లో 36 మంది చనిపోయారు. పలువురు ఈ మంటల్లో చిక్కుకుని గాయాలపాలైయ్యారు. 
 
హవాయి ద్వీపంలోని విమానాశ్రయంలో విమానాల రాకపోకలను రద్దు చేశారు. ద్వీపంలో రెండువేల మంది పర్యాటకులు ఆశ్రయం పొందినట్లు సమాచారం. 
 
హవాయి కన్వెన్షన్ సెంటర్ పర్యాటకులకు, స్థానికులకు ఒకే విధంగా వసతి కల్పించడానికి సిద్ధంగా ఉంచబడింది. అడవి మంటలను పూర్తి స్థాయిలో ఆర్పివేస్తున్నారు. రెస్క్యూ ప్రయత్నానికి సహాయం చేయాలని అధ్యక్షుడు జో-బైడెన్ సైన్యాన్ని ఆదేశించారు.