1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Infosys Techie Dies Saving Twin Daughters in Australia

రైల్వే ట్రాక్‌పై పడిన కుమార్తెలు.. కాపాడిన టెక్కీ... చివరికి ఏమైందంటే?

crime scene
ప్రమాదవశాత్తు రైల్వే ట్రాక్‌పై పడిన తన కుమార్తెలను రక్షించే ప్రయత్నంలో ఇన్ఫోసిస్ టెక్కీ ఆస్ట్రేలియాలో ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే, 40 ఏళ్ల ఆనంద్ రన్వాల్ సిడ్నీలో పనిచేసే ఇన్ఫోసిస్ ఐటీ ఉద్యోగి. 
 
ఆదివారం (జూలై 21) మధ్యాహ్నం 12.25 గంటలకు ఆనంద్ తన భార్య, కవల కుమార్తెలతో కలిసి కార్ల్‌టన్ స్టేషన్‌లో ఉన్నాడు. కుటుంబ సభ్యులు లిఫ్ట్‌పై నుంచి కిందకు దిగిన తర్వాత ప్రమాదవశాత్తు చిన్నారులు ఉన్న ప్రామ్ రైల్వే ట్రాక్‌పైకి బోల్తా పడింది.
 
ఆనంద్ తన కూతుళ్లను కాపాడేందుకు ప్లాట్ ఫామ్‌పై నుంచి రైల్వే ట్రాక్ పైకి దూకాడు. ఈ క్రమంలో పెద్ద కూతురుని కాపాడగలిగాడు. అయితే ఆనంద్, అతని చిన్న కూతురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో గాయపడిన ఆనంద్ భార్య, అతని కుమార్తెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అదే రాత్రి డిశ్చార్జ్ అయ్యారు.
 
ఇకపోతే.. ఆనంద్ అతని కుటుంబం 2023 చివరలో సిడ్నీకి మారారు. వారు సిడ్నీలోని కొగరా శివారులో ఉండేవారు. ఇటీవల, ఆనంద్ తల్లిదండ్రులు సిడ్నీలో అతనిని సందర్శించారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
వైకాపా నేత కొడాలి నాని మాజీ పీఏపై దాడి.. తలకు తీవ్ర గాయం