శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By జె
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (19:41 IST)

భార్యపై అనుమానంతో అక్కడ గమ్ అంటించిన భర్త..ఎక్కడ..?

భార్య తరచూ బిజినెస్ పని మీద బయటకు వెళ్ళడం.. రెండు, మూడురోజుల తరువాత రావడంతో భర్తకు ఆమెపై డౌట్ వచ్చింది. ఆమెను ఎలాగైనా నియంత్రించాలనుకున్నాడు. అనుమానంతో రగిలిపోయాడు. భార్యకు నిద్రమాత్రలు తక్కువ మోతాదులో ఇచ్చాడు. గాఢ నిద్రలో ఉన్న భార్య జననాంగాలను గమ్ తో మూసేశాడు. 
 
కెన్యాలో నివాసముండే డెన్నిస్ ముమోకు తన సమీప బంధువును ఇచ్చి వివాహం చేశారు. పెళ్ళయిన రెండు నెలల వరకు భార్యను ప్రేమగానే చూసుకున్నాడు డెన్నిస్ ముమో. అయితే బిజినెస్ చేస్తున్న తన భార్య తరచూ బయట ప్రాంతాలకు వెళుతూ ఉండేది.
 
మొదట్లో ఏ మాత్రం అనుమానం పడని భర్త..ఆ తరువాత తన భార్య మొబైల్స్‌లో నలుగురి ఫోన్ నెంబర్లలో ఎక్కువ సేపు ఆమె మాట్లాడుతూ ఉండడం గమనించాడు. దీంతో అనుమానం పెంచుకున్నాడు. భార్యను నిలదీశాడు. ఆమె ఎంత చెప్పినా వినిపించుకోలేదు. 
 
అయితే అనుమానం మరింత పెరిగిపోవడంతో రెండురోజుల క్రితం ఇంటికి వచ్చిన భార్యకు జ్యూస్ లో తక్కువ మోతాదులో నిద్రమాత్రలను కలిపిచ్చాడు. ఆ తరువాత ఆమె బాగా నిద్రపోతుండడాన్ని చూసి జననాంగాలను గమ్ తో మూసేశాడు. ఉదయం లేచి చూసిన భార్య షాకైంది. నొప్పి ఎక్కువగా ఉండడంతో వెంటనే ఆసుపత్రికి వెళ్ళి చేరింది. తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.