పెళ్లి పేరుతో అమ్మాయిని వాడేసుకున్న యువకుడు...

rape
ఠాగూర్| Last Updated: బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (13:26 IST)
ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువతిని ఓ యువకుడు మోసం చేశాడు. లైంగికంగా వాడుకున్నాడు. పెళ్లి గురించి మాట్లాడుకుందాం రమ్మని తన రూమ్‌కు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో బాధిత యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ మోసగాడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నల్గొండ జిల్లా డిండి మండలానికి చెందిన యువతి (20) ప్రస్తుతం కొత్తపేటలోని ఓ దవాఖానలో అనస్థీషియా టెక్నీషియన్‌గా పని చేస్తుంది. ఇదే జిల్లాలోని హాలియా మండలం, ఎల్లాపూర్‌ తండాకు చెందిన కొర్రా గోవింద్‌ నాయక్‌ (23) ఎల్బీనగర్‌ గుంటి జంగయ్య కాలనీలో నివాసముంటున్నాడు.

ఈ క్రమంలో సదరు యువతి సెల్‌ఫోన్‌ నంబర్‌ తెలుసుకుని పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నాను.. పెండ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆ యువతి లొంగిపోయి.. సర్వం సమర్పించుకుంది. పెళ్లి విషయం మాట్లాడుకుందామని తన రూమ్‌కు తీసుకెళ్లి గోవింద్ నాయక్.. ఆ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తాను మోసపోయానని గ్రహించిన బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. గోవింద్ నాయక్‌ను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.దీనిపై మరింత చదవండి :