శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (17:00 IST)

అమ్మా-నాన్నా నాకు పెళ్ళి చేయరూ అంటూ అడిగిన యువతి: చంపేసిన తల్లిదండ్రులు

కన్నతల్లిదండ్రులే ఆ యువతి పాలిట కసాయిలుగా మారారు. పెళ్ళి చేసి కట్నం ఇవ్వాల్సి వస్తుందనే కారణంగా 32 ఏళ్ల కన్నబిడ్డను బండరాళ్ళతో కొట్టి చంపేందుకు ప్రయత్నించారు. తోడబుట్టిన అన్న కూడా తల్లిదండ్రులకు సహకరించాడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.
 
మునుగోడు మండలం వెలగలగూడెం గ్రామానికి చెందిన తీర్పారి బుచ్చయ్య, లక్ష్మమ్మ దంపతులకు గోవర్ధన్, కవిత అనే ఇద్దరు పిల్లలున్నారు. కవిత ఎమ్మెస్సీ పూర్తి చేసి ఇంటి దగ్గరే ఉంటుంది. తల్లిదండ్రులు కవిత పెళ్ళి చేయమని కూమారుడు గోవర్ధన్‌ను కోరుతున్నప్పటికీ అతను నిరాకరిస్తూ వచ్చేవాడు.
 
ఇదే విషయంపై కుటుంబ సభ్యుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీనితో కవిత పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తల్లిదండ్రులతో పాటు యువతి అన్నకు కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు పంపించేశారు. అయితే తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ కోపంతో ఊగిపోయిన తల్లిదండ్రులు, అన్న ముగ్గురు కలిసి నిద్రిస్తున్న కవితను బండరాయితో కొట్టి చంపేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తన కూతురిని చంపేశారని స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల విచారణలో అసలు విషయాన్ని ఒప్పుకుని లొంగిపోయారు.