సంబంధిత వార్తలు
- ఒంటరిగా వున్న యువతి.. బలవంతంగా ముద్దు పెట్టబోతే.. కరోనా కాపాడింది.. ఎలా?
- మేడారం మహాజాతర.. పాము కనిపిస్తే.. వనదేవతల ఆశీర్వాదం.. ఒక్క ఈగ వాలదు తెలుసా?
- "సీటిమార్"లో తమన్నా లుక్ ఇదే..
- యాంకర్ మెడలో పాము.. బుసలు కొట్టడంతో గజగజ వణికిపోయింది... (Video)
- ‘దేశంలోని సీసీ కెమెరాల్లో 65 శాతం ఒక్క తెలంగాణలోనే ఉన్నాయి’ - ప్రెస్ రివ్యూ
తెలంగాణలో ఘోరం.. యువతిపై మైనర్ల సామూహిక అత్యాచారం
తెలంగాణలో ఓ ఘోరం జరిగింది. దిశ హత్యాచార ఘటన తర్వాత దోషులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నా.. అమ్మాయిలపై అత్యాచారాల పరంపర మాత్రం కొనసాగుతోంది. వివరాల్లోకి వెళితే.. స్నేహం పేరిట ఓ యువతిని నమ్మించి మోసం చేశాడు. ఆమెను నిర్జీవ ప్రాంతానికి తీసుకువెళ్లి అతని స్నేహితులతో కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే ఈ దారుణ ఘటనకు పాల్పడినవారంతా మైనర్లే కావడం గమనార్హం.
ఈ ఘటన వరంగల్ జిల్లా మహబూబాబాద్ గ్రామీణ మండలంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఓ తండాకు చెందిన 16 ఏళ్ల బాలుడు హైదరాబాద్‌లో క్యాటరింగ్ పనులు చేస్తున్నాడు. అయితే అక్కడ అతనికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఇటీవలే సొంతూరుకు వచ్చిన ఆ బాలుడు యువతికి ఫోన్‌చేసి తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించాడు.
ఆమెను తొలుత ఆటోలో తండాకు తీసుకెళ్లి అక్కడి నుంచి సమీపాన ఉన్న మామిడి తోటకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఆ బాలుడి స్నేహితులంతా చేరుకున్నారు. అదే తండాకే చెందిన ఇద్దరు, మహబూబాబాద్ పట్టణానికి చెందిన మరో ఇద్దరు, తొర్రూరుకు చెందిన ఓ బాలుడు ఉన్నారు.
వీళ్లంతా కలిసి పక్కా ప్లాన్ వేశారు. ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురిపై కేసు నమోదుచేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు.
తర్వాతి కథనం
