సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 ఫిబ్రవరి 2020 (13:27 IST)

"సీటిమార్"లో తమన్నా లుక్ ఇదే..

Seeti maar
"సీటిమార్" సినిమాలో తమన్నా నటిస్తోంది. ఇందులో గోపిచంద్ హీరో. కబడ్డీ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం నంది దర్శకత్వంలో రూపొందుతుంది. ఇక ఇప్పటికే రిలీజ్‌ చేసిన గోపిచంద్‌ లుక్‌ ఆకట్టుకుంది. ఈ సినిమాలో గోపిచంద్ ఆంధ్ర కబడ్డీ జట్టుకు కోచ్‌గా.. మీల్కి బ్యూటీ తమన్నా తెలంగాణ కబడ్డీ జట్టుకు కోచ్‌గా నటిస్తున్నారు.
 
తాజాగా తమన్నా పాత్రకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ను సినీ యూనిట్ విడుదల చేసింది. తమన్నా ఇందులో జ్వాలారెడ్డిగా కనిపించనుంది. ఇంకా ఈ చిత్రంలో సీనియర్‌ నటి భూమిక, రావు రమేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేసేందుకు సినీ యూనిట్ సర్వం సిద్ధం చేస్తోంది.