బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 జనవరి 2020 (11:19 IST)

#F2కి సీక్వెల్ రానుంది.. వెంకటేష్ ఏం చెప్పారంటే?

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా గత ఏడాది సంక్రాంతికి వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ సినిమా ఎఫ్2 భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లు గా తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. 
 
అంతకముందు మంచి కమర్షియల్ ఎంటెర్టైనర్లు చేసి ప్రేక్షకులను అలరించిన అనిల్ రావిపూడి, తొలిసారిగా ఈ సినిమాతో పూర్తి కామెడీ ఎంటర్టైనర్‌ని తెరకెక్కించారు. ఈ సినిమాకు సీక్వెల్ తీస్తాను అని అప్పట్లో దర్శకుడు అనిల్ చెప్పారు. 
 
ఈ వ్యాఖ్యలపై విక్టరీ వెంకటేష్ తాజాగా స్పందించారు. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా పనులతో బిజీగా ఉన్న దర్శకుడు అనిల్, ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పై త్వరలో పనిచేయనున్నారని, అలానే ఈ సినిమాలో తనతో పాటు మరొక్కసారి వరుణ్ తేజ్ కూడా నటించబోతున్నట్లు వెంకీ చెప్పారు.
 
అయితే హీరోయిన్లుగా తమన్నా, మెహ్రీన్ నటిస్తారా లేక వారి స్థానంలో మరొకరు ఉంటారా అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం అని, అలానే ఈ సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లోనే తెరకెక్కనున్నట్లు వెంకటేష్ వెల్లడించారు. ఇక ఈ వార్తతో వెంకీ, మెగా ఫ్యాన్స్ మరొక్కసారి పండగ చేసుకుంటున్నారు.