గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 19 డిశెంబరు 2019 (22:47 IST)

ద‌బాంగ్ 3 ప్రి-రిలీజ్ ఫంక్ష‌న్ - స్టేజ్ పైన చిందేసిన స‌ల్మాన్, వెంకీ, చెర్రీ

స‌ల్మాన్‌ఖాన్ హీరోగా స‌ల్మాన్‌ఖాన్ ఫిలింస్‌, అర్బాజ్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్‌, స‌ఫ్రాన్ బ్రాడ్‌కాస్ట్ మీడియా లిమిటెడ్ ప‌తాకాల‌పై స‌ల్మాన్‌ఖాన్‌, అర్బాజ్‌ఖాన్‌, నిఖిల్ ద్వివేది నిర్మించిన‌ చిత్రం `ద‌బాంగ్ 3`. ప్ర‌భుదేవా ద‌ర్శ‌కుడు. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 20న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ చిత్రాన్ని తెలుగులో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ విడుద‌ల చేస్తుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స‌ల్మాన్ ఖాన్, ప్ర‌భుదేవా, టాలీవుడ్ నుంచి వెంక‌టేష్, రామ్ చ‌ర‌ణ్‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. 
 
చాలా రోజుల త‌ర్వాత వెంక‌టేష్‌ గారిని క‌లిశాను. అలాగే రామ్‌చ‌ర‌ణ్‌ని చూస్తుంటే చిరంజీవి గారిని చూస్తున్న‌ట్లే ఉంది. ద‌బాంగ్ 3 విష‌యానికి ప‌క్కా మాస్‌గా, యాక్ష‌న్ మూవీలా ఉంటుంది. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది అని డైరెక్ట‌ర్ ప్ర‌భుదేవా చెప్పారు. ఇక మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్ అయితే... ``స‌ల్మాన్ గారంటే నాకెంతో ప్రేమ‌. స‌ల్మాన్ గారు, చిరంజీవి గారు, సుదీప్ గారు, వెంక‌టేష్ గారు .. వీరంద‌రి నుండి ఓ విష‌యం నేర్చుకున్నాను. అదే క్ర‌మ‌శిక్ష‌ణ‌. మా త‌రం హీరోలు వారి నుండి నేర్చుకున్న‌దిదే. 
 
ప్ర‌భుదేవా గారికి అభినంద‌న‌లు. సోనాక్షిసిన్హా, సుదీప్ స‌హా ఎంటైర్ యూనిట్‌కి కంగ్రాట్స్‌`` అన్నారు. విక్ట‌రీ వెంక‌టేష్‌ మాట్లాడుతూ... ``ద‌బాంగ్ 3 తెలుగులో విడుద‌ల కావ‌డం అది కూడా తెలుగు డైలాగ్స్‌ను స‌ల్మాన్ భాయ్ వాయిస్ నుండి విన‌డం బావుంది. తెలుగులో సినిమాను సూప‌ర్‌హిట్ చేస్తార‌ని భావిస్తున్నాను. సోనాక్షిసిన్హా, సుదీప్‌, స‌యి స‌హా ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు`` అన్నారు.
 
స‌ల్మాన్‌ ఖాన్ మాట్లాడుతూ... ``హైద‌రాబాద్ ప్ర‌జ‌లు ఎంతో ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. హిందీలో నా సినిమాలు ఇక్క‌డ రిలీజ్ అయ్యేవి. మంచి రెస్పాన్స్ వ‌స్తుండేవి. ఆ రెస్పాన్స్‌ను చూసి తెలుగులో కూడా రిలీజ్ చేయాల‌ని ద‌బాంగ్ 3ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. రామ్‌చ‌ర‌ణ్ నాకు ఎంతో స‌న్నిహితుడు. నా చిన్న‌త‌మ్ముడిగా భావిస్తాను. 
 
చిరంజీవి గారితో ఎంతో స‌న్నిహితం ఉంది. వెంకటేష్‌ గారితో 25ఏళ్లుగా ప‌రిచ‌యం ఉంది. ప్ర‌భుదేవా గారు చ‌క్క‌గా డైరెక్ట్ చేశారు. సినిమా త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాను అన్నారు. ఈ స్టేజ్ పై స‌ల్మాన్ ఖాన్, వెంక‌టేష్‌, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి చేసి డ్యాన్స్ చేయ‌డం విశేషం.