ఈ మామకు ఇంకేం కావాలి-వెంకటేష్
విక్టరీ వెంకటేష్ - యువ సమ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్‌లో రూపొందిన భారీ మల్టీస్టారర్ వెంకీ మామ. జై లవకుశ ఫేమ్ బాబీ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి ఈ సినిమాని నిర్మించింది.
డిసెంబర్ 13న విక్టరీ వెంకటేష్ పుట్టినరో జు కానుకగా ఈ సినిమాని భారీ స్ధాయిలో రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమా గురించి వెంకటేష్ స్పందిస్తూ... ఈ సినిమాలో చైతూకు మాత్రమే నేను మామ.. కానీ విడుదల తర్వాత అందరికీ వెంకీ మామనే.
ఎక్కడికి వెళ్లినా కూడా వెంకీమామ అంటున్నారు. మా సురేష్ ప్రొడక్షన్స్‌లో చైతూ తొలిసారి చేస్తున్నాడు. ఈ సినిమాలో చైతూ యాక్టింగ్ చించేసాడు. నాకు చాలా గర్వంగా ఉంది. ఈ మామకు ఇంకేం కావాలి చెప్పండి. ముందు నుంచే ఈ సినిమా బాగా వచ్చింది.
మంచి కథ తెచ్చుకున్నాం. అందరం కష్టపడి సూపర్ హిట్ చేస్తున్నామని కష్టపడి పని చేసాం.
టెక్నీషియన్స్ అంతా కష్టపడ్డారు. థమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా దర్శకుడు బాబీ ఈ సినిమాను అద్భుతంగా తీసి మామ అల్లుడు సెంటిమెంట్ టెర్రిఫిక్‌గా తీశాడు.
చాలా థ్యాంక్స్ బాబీ.. అద్భుతమైన సినిమా ఇచ్చావు. ఈ సినిమాలో అమ్మైనా నాన్నైనా నువ్వేలే నువ్వే వెంకీ మామ అనే పాట ఉంది. నాకు అంతా ఫ్యాన్సే. నా 30 ఏళ్ల కెరీర్‌లో అభిమానులే నా బలం. డిసెంబర్ 13న థియేటర్స్ లో కలుద్దాం అని చెప్పారు.