శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 డిశెంబరు 2019 (13:48 IST)

పాయల్ రాజ్ పుత్ పుట్టిన రోజు.. అదిరిపోయే స్టెప్పులేస్తున్న వెంకీమామ

విక్టరీ వెంకటేష్, అక్కినేని హీరో నాగ చైతన్య, పాయల్ రాజ్ పుత్, రాశీ ఖన్నా కాంబోలో వస్తున్న సినిమా వెంకీ మామ. ఈ సినిమా నుంచి ''కోకా కోలా పెప్సీ ఈ మామ అల్లుడు సెక్సీ'' సాంగ్‌ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పాటలో విక్టరీ వెంకటేశ్, అక్కినేని యువ హీరో నాగ చౌతన్య అందమైన భామలతో అదిరిపోయే స్టెప్పులేస్తున్నారు.  
 
ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన సాంగ్ ఇప్పటివరకూ లక్షకు పైగా వ్యూస్ సాధించింది. విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న ‘వెంకీమామ’ చిత్రం ప్రయోషన్‌లో భాగంగా చిత్రయూనిట్ ఈ సాంగ్‌ను విడుదల చేసింది. పాయల్ రాజ్ పుత్ పుట్టిన రోజు నేపథ్యంలో ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.