సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 డిశెంబరు 2019 (11:27 IST)

కత్తిలాంటి కత్రినా వర్కౌట్స్ చూడతరమా?

బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న కత్తిలాంటి హీరోయిన్లలో కత్రినా కైఫ్ ఒకరు. ఈమె తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. విక్టరీ వెంకటేష్ నటించిన మల్లీశ్వరి, అల్లరి పిడుగు వంటి చిత్రాల్లో నటించింది. చివరగా భారత్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
 
దక్షిణాది చిత్రాల్లో అడపాదడపా కనిపిస్తున్న కత్రినా కైఫ్... బాలీవుడ్‌లో మాత్రం పూర్తిస్థాయిలో బిజీగా ఉంది. ప్రస్తుతం 'సూర్య‌వంశీ' సినిమాలో బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ సరసన నటిస్తోంది. అయితే ఫిట్నెస్‌పై ఎక్కువ‌గా దృష్టి పెట్టే క‌త్రినా షూటింగ్‌లేని స‌మ‌యంలో జిమ్‌లోనే ఎక్కువ‌గా స‌మ‌యం గ‌డుపుతూ ఉంటుంది. 
 
తాజాగా త‌న వ‌ర్కౌట్స్‌కి సంబంధించిన ప‌లు వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో కత్రినా ప్రముఖ ట్రైన‌ర్‌ యాస్మిన్ కరాచీవాలా, ఆమె వ్యాయామ భాగస్వామి రెజా కటానితో కలిసి కొన్ని అత్యంత క్లిష్టమైన వర్కౌట్స్ చేస్తూ కనిపించింది. వీటిని చూసిన నెటిజ‌న్స్ నోరెళ్ళ‌పెడుతున్నారు. క‌త్రినా గ‌తంలోనూ త‌న వ‌ర్క‌ౌట్స్‌కి సంబంధించిన ప‌లు వీడియోలు షేర్ చేసి నెటిజ‌న్స్‌కి మాంచి కిక్ ఇచ్చిన విషయం తెల్సిందే.