గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: మంగళవారం, 25 జూన్ 2019 (21:05 IST)

రోజూ నాకు ఆ దెబ్బలు అలవాటే - రకుల్ ప్రీత్ సింగ్

అందంతో పాటు అభినయం రకుల్ ప్రీత్ సింగ్ సొంతం. ముందు నుంచి రకుల్ ప్రీత్ సింగ్ దూకుడుగానే వ్యవహరిస్తూ అన్ని సినిమాల్లోను తన టాలెంట్‌ను నిరూపించుకుంటోంది. తెలుగు సినీపరిశ్రమలో టాప్ టెన్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. టాప్ లెన్లో టాప్ 3లో రకుల్ ప్రీత్ సింగ్ పోటీ పడుతున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.
 
జిమ్‌లో ఎప్పుడూ వర్కవుట్లు చేసుకుంటూ తన శరీరాన్ని అందంగా మలుచుకుంటోంది రకుల్ ప్రీత్ సింగ్. అయితే సినిమా షూటింగ్ లోను, జిమ్‌లో వర్కవుట్లు చేసేటప్పుడు మాత్రం వాటిపైనే ఎక్కువ దృష్టి పెడతానని చెబుతోంది రకుల్ ప్రీత్ సింగ్.
 
కానీ ఇంటిలో తిరిగేటప్పుడు మాత్రం ఎక్కడో ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటాను. దీంతో ప్రతిరోజు ఏదో ఒక విధంగా దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఈ దెబ్బలు నాకు మామూలే. చిన్నచిన్న గాయాలను అస్సలు పట్టంచుకోను అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. చిన్న దెబ్బలైతే ఎలాంటి ఇబ్బందులు లేవు. పెద్ద దెబ్బలు తగలకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నానంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం తెలుగు, తమిళంలలో వరుసగా నాలుగు సినిమాలు చేతిలో ఉంచుకుని బిజీ బిజీగా గడుపుతోంది రకుల్ ప్రీత్ సింగ్.