సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : మంగళవారం, 11 జూన్ 2019 (15:48 IST)

టబుతో 28 ఏళ్ల తర్వాత రొమాన్స్ చేయనున్న వెంకీ?

అందాల సీనియర్ నటి టబు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. హిందీలో విడుదలైన 'దే దే ప్యార్ దే' చిత్రం అక్కడ మంచి వసూళ్లనే రాబట్టింది. అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్, టబూ కీలక పాత్రలుగా ఈ సినిమా తెరకెక్కింది. పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను సురేశ్ ప్రొడక్షన్స్ వారు సొంతం చేసుకున్నారు. 
 
ఇందులో విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా ఈ సినిమాను నిర్మించనున్నారు. హిందీలో టబు చేసిన పాత్ర కోసం తెలుగులోను ఆమెనే తీసుకున్నారని తెలుస్తోంది.

28 ఏళ్ల క్రితం 'కూలీ నెం 1' సినిమాలో వెంకీతో జోడీ కట్టిన టాబు, మళ్లీ ఇంతకాలానికి వెంకీ సరసన నటించబోతోంది. మరి రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ సినిమాలో కనిపిస్తుందా అనేది తెలియాల్సి వుంది.