శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By కుమార్
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (14:13 IST)

ఐపీఎల్ మ్యాచ్‌లో సందడి చేసిన వెంకీ

టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేష్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. వీలైనప్పుడల్లా స్టేడియంకు వెళ్లి అక్కడ సందడి చేస్తుంటాడు వెంకీ. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ జరుగుతుండటంతో వెంకీ క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఏటా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ మ్యాచ్‌లకు ఆయన హాజరై సందడి చేస్తుంటారు. 
 
నిన్న ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో టాలీవుడ్‌ హీరో విక్టరీ వెంకటేష్‌ తళుక్కుమన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌ - రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌ను నేరుగా చూసి వెంకటేష్ క్రికెటర్లలో ఉత్సాహం నింపాడు, స్టేడియంలో వెంకీని చూసిన అభిమానులు కేరింతలు కొట్టారు. 
 
వెంకటేష్‌కు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో చెప్పాల్సిన పనిలేదు.  ఇండియాలో జరిగిఏ వన్ డే, టెస్ట్ మ్యాచ్‌‌లతోపాటు ఐపీఎల్ మ్యాచ్‌లను స్టేడియానికి వచ్చి చూడటం వెంకటేష్‌కు అలవాటు.