సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : శనివారం, 30 మార్చి 2019 (11:59 IST)

ఐపీఎల్2019 : హైదరాబాద్ థ్రిల్లింగ్ విజయం

ఐపీఎల్ 12వ అంచె పోటీల్లో భాగంగా, శుక్రవారం హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు నిర్ధేశించిన 199 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలివుండగానే ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 
 
 
హైదరాబాద్ జట్టులో వార్నర్ 37 బంతుల్లో 69, 9ఫోర్లు, 2సిక్స్‌లు కొట్టగా, బెయిర్‌స్టో 28 బంతుల్లో 45, 6ఫోర్లు, సిక్స్ కొట్టి జట్టు విజయంలో కీలక పాత్రను పోషించారు. గోపాల్(3/27)కు మూడు వికెట్లు దక్కాయి. 
 
తొలుత సంజూ శాంసన్(55 బంతుల్లో 102 నాటౌట్, 10ఫోర్లు, 4 సిక్స్‌లు) సూపర్ సెంచరీతో ఆకట్టుకోగా, రహానే(49 బంతుల్లో 70, 4ఫోర్లు, 3సిక్స్‌లు) రాణించాడు. రషీద్‌ఖాన్(1/24), నదీమ్ (1/36) ఒక్కో వికెట్ తీశారు. రషీద్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.