శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 28 మార్చి 2019 (13:20 IST)

వారు క్రమశిక్షణగా ఉండాలంటే.. ఏం చేయాలి..?

నేటి తరుణంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లలను అంతగా పట్టించుకోవడం లేదు. అంతేకాదు, చిన్నారులకు సంబంధించిన విషయాలను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. పెద్దయ్యాక వాళ్లే తెలుసుకుంటారనే అభిప్రాయంలో ఉంటున్నారు. తల్లిదండ్రులు ఇలా చేయడం వలన వాళఅలకు నలుగురిలో ఎలా ఉండాలీ.. ఎలా వ్యవహరించాలనేది తెలియక ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు. అలానే పిల్లల్లో క్రమశిక్షణ తగ్గుతోంది.
 
క్రమశిక్షణ అంటే పిల్లలతో మరీ కఠినంగా ఉండడం కాదు.. వాళ్లను గమనిస్తూ చేస్తోన్న పొరపాట్లను తెలియజేయాలి. వారు ఎలా ఉండాలనే విషయాన్ని ఎప్పటికప్పుడు చెప్పాలి. మీకు ఎంత తీరికలేకపోయినా సరే.. పిల్లలకోసం కొంత సమయాన్ని కేటాయించాల్సిందే. ముఖ్యంగా ఎప్పటికప్పుడు వారి ప్రవర్తన, వ్యక్తిత్వం, భావోద్వేగాలను గమనిస్తుండాలి. అప్పుడే క్రమశిక్షణతో కూడిన జీవితానికి వారు అలవాటు పడుతారు.
 
ఉద్యోగాలు చేసే చాలామంది తల్లులు పిల్లలకు కోసం సమయం కేటాయించట్లేదనే అపరాధ భావంతో ఉంటారు. దాంతో చిన్నారులతో కాస్త కఠినంగా వ్యవహరించడానికి బాధపడుతుంటారు. అది సరికాదు. పిల్లలు అడిగినవే కాదు.. అడగనివీ కూడా ఇచ్చి.. అవసరాల ప్రాధాన్యం విడమరిచి చెప్పలేకపోతున్నారు. దీనివలన వారు వ్యక్తిగత క్రమశిక్షణ అలవర్చుకోరని మరవకూడదు.